calender_icon.png 9 August, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితం

09-08-2025 12:30:52 AM

 కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, ఆగస్టు 8 (విజయక్రాంతి):  ప్రభుత్వం నిరుపేదలందరికీ ఇండ్లు కట్టించాలన్న సంకల్పంతో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా ఎస్పీ కె. నర్సింహతో కలిసి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. వానాకాలం ప్రారంభ మైనందున ఇసుకకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, హౌసింగ్ శాఖ, ఎంపీడీవోలు, తహసి ల్దార్లతో సమన్వయం చేసుకుంటూ ఏ గ్రామానికి ఎన్ని ఇండ్లు అనుమతి ఇచ్చారో దానికి సరి పోను ఇసుక ఏర్పాటు చేసుకోవాలని, అలాగే మైనింగ్ శాఖ సహాయంతో ఇసుక బజారు లను ఏర్పాటు  చేసేందుకు  ఆర్డీవోలు, తహసిల్దారులు స్థలాలను గుర్తించాలన్నారు.

నాగారం -పెరబో యిన గూడెం అప్రోచ్ రోడ్డుకు ప్రతిపాదనలు పంపాలని పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. జిల్లాలో చేపడుతున్న జానపహాడ్,బెట్ట తండా, ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్లకు, మున్నేరు వాగు  రక్షణ గోడకు ఇరిగేషన్ శాఖ ఇసుకకు అనుమతి ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. జిల్లాలో ఎక్కడైనా ఇసుక అక్రమంగా డంపు చేస్తే అలాంటి ప్రాంతాలను గుర్తించి వెంటనే సీజ్ చేసి అట్టి ఇసుకను ఇందిరమ్మ ఇండ్లకి కేటాయిం చాలని అధికారులను ఆదేశించారు.

  స్థానికంగా ఉన్న వాగులలో ఇసుక రీచ్ లను గుర్తించి వెంటనే ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. తదుపరి ఎస్పీ కే. నరసింహ మాట్లాడుతూ  ఆంధ్రప్రదేశ్ నుండి సూర్యాపేట జిల్లాలోకి  ఇసుక రవాణా అనుమతి లేదని, రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో ఇసుక అక్రమ రవాణాను ఎప్పటికప్పుడు అరికడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి రాంబాబు, డి ఎఫ్ ఒ సతీష్ కుమార్,డి ఆర్ డి ఒ వి.వి. అప్పారావు, ఆర్డీవో వేణుమాధవ్, డి పి ఒ యాదగిరి,ట్రాన్స్ పోర్ట్ అధికారి జయప్రకాశ్ రెడ్డి,  సి .సూపరింటిండెంట్ శ్రీనివాసరాజు, తహసీల్దార్ లు, మైనింగ్ అధికారులు, భూగర్భ జల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించాలి

సూర్యాపేట ఆగస్టు 8 (విజయక్రాంతి) : స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం ఎస్పి కే నరసింహతో కలిసి స్వాతంత్ర దినోత్సవం ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ వారు పరేడ్ కి సంబంధించిన ఏర్పాటు చేయాలని, గ్రౌండ్ ఆర్‌అండ్‌బి శాఖ, స్టేజ్ ఏర్పాట్లు, స్వాతంత్ర సమరయోధుల జాబితా తయారు చేయాలని ఆర్డీవోకు సూచించారు.

హెల్త్ డిపార్ట్మెంట్  హెల్త్ క్యాంపు పెట్టాలని,  ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు,108 వాహనం  అందుబాటులో ఉంచాలనీ సూచించారు. మున్సిపాలిటీ శాఖ త్రాగు నీరు, శానిటేషన్ చేయాలని ఉపన్యాస ప్రతులు సిపిఓ తయారు చేయాలని,  ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ సేఫ్టీ పరికరాలతో సిద్ధంగా ఉండాలని, విద్యుత్ సరఫరా ఎలక్ట్రిసిటీ వాళ్ళు చూసుకోవాలని కలెక్టర్ అన్నారు. మిగిలిన శాఖల వారు తమ శాఖకు సంబంధించిన పనులను విధిగా పూర్తి చేయాలన్నారు. అధికారులంతా సమన్వయంతో పని చేస్తూ ఎక్కడ ఏ లోటు రాకుండా వేడుకలను విజయవంతం చేయాలన్నారు. ఈ  సమావేశంలో అదనపు కలెక్టర్ పి రాంబాబు, సూర్యాపేట ఆర్డిఓ వేణు మాధవ్, మున్సిపల్ కమిషనర్  సిహెచ్ హన్మంతరెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.