calender_icon.png 9 August, 2025 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆత్మహత్య చేసుకోబోయిన వ్యక్తిని కాపాడిన పోలీసులు

08-08-2025 11:48:29 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేంద్రంలో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా మహబూబాబాద్ ట్రాఫిక్ ఎస్ఐ అరుణ్ కుమార్, సిబ్బంది కలిసి వెళ్లి ఆ వ్యక్తిని కాపాడారు. పరకాలకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో హైమా గార్డెన్ వద్ద రైల్వే ట్రాక్ వద్దకు చేరుకొని ఆత్మహత్య ప్రయత్నం చేస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. అతన్ని రక్షించి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినట్టు పోలీసులకు చెప్పాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తి ని కాపాడిన పోలీసులను ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ అభినందించారు.