08-08-2025 11:39:00 PM
- అక్రమంగా ఇసుక తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి
- ఇసుక డంప్ చేసిన ట్రాక్టర్లపై, కాంట్రాక్టర్ పై చర్యలేవి
ఇల్లంతకుంట, ఆగస్టు 8 (విజయక్రాంతి) రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇల్లంతకుంట సామాన్యుడు ఇసుక కావాలంటే సవాలక్ష ప్రశ్న లు వేసే అధికారులు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోకపోవడంపై ఇల్లంతకుంట మండల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే ఇల్లంతకుంట మండల కేంద్రం లో నిర్మిస్తున్న 50 పడకల ఆసుపత్రికి తహశీల్దార్ కార్యాలయంలో ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇసుక డంప్ చేసిన ఎటువంటి చ ర్యలు తీసుకోలేదు.
దీనిపై మండల తహశీల్దార్ ను వివరణ కోరగా పర్మిషన్ కొరకు గు రువారం రోజు కాంట్రాక్టర్ వద్ద నుండి లేఖ వచ్చిందని కానీ ఎటువంటి డీడీ కట్టకపోవడంతో పర్మిషన్ ఇవ్వలేదని తెలిపారు. గతం లో ఓ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం కో సం ఇసుక పోసుకున్న కాంట్రాక్టర్ కు పర్మిషన్ లేదని ఇసుక ను సీజ్ చేసి, వేలం నిర్వ హించిన అధికారులు దీనిపై మౌనంగా ఉం డడం వెనుక అంతర్యం ఏంటో అని ప్రజలు అంటున్నారు. అయితే సాధారణంగా ఎవరికైతే ఇసుక అవసరం ఉంటదో వారి వద్ద నుండి పర్మిషన్ లేఖతో పాటు డీడీ తీసుకొని అట్టివారికి పర్మిషన్ ఇస్తారు.
కానీ ఇక్కడ పర్మిషన్ ఒకరి పేరుతో తీసుకొని అదే గ్రా మంలోని మరొకరికి ఇసుక పో స్తూ అడ్డగోలుగా వసూలు చేస్తూ సొమ్ము చే సుకుంటున్నారు. ఎవరైనా పోలీసు వారు వచ్చి తనిఖీ చేసినప్పుడు సార్ మాకు పర్మిషన్ ఉందని కావాలంటే చూడండి అంటూ పర్మిషన్ లేఖను చూపించడంతో వారు కూడా వెనుతిరిగి వెళ్ళిన సందర్భాలు కోకొల్లలు. అయితే ఆ పర్మిషన్ లేఖ మీద బిక్క వాగు నుండి మండలంలోని ఓ గ్రామం అని మాత్రమే ఉండడంతో ఎవరు ఏం చేయలేని పరిస్థితి నెలకొంది.
ఇలా అక్రమం గా ఇసుక తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కావాలంటే ఈ పేపర్ లేదు ఆ పేపర్ లేదంటూ సామాన్యులను తిప్పించుకునే తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది ఇటువంటి వారికి ఎటువంటి కొర్రీలు లేకుండా పర్మిషన్ ఇస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులు అక్రమం గా ఇసుక తరలిస్తున్నారని కేసులు నమోదు చేసి, బైండోవర్ చేసే అధికారులు దీనిపై మౌనంగా ఉండడం వెనుక కారణాలు ఏమిటో మరి.