04-05-2024 12:44:41 AM
కోల్‌కతా, మే 3: బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ డ్యాన్స్ చేశారు. నాడియా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె. తృణమూల్ కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ మహువామొయిత్రాకు మద్దతుగా కృష్ణానగర్ లోక్‌సభ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహువాతో కలిసి మమత కాసేపు డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను మహువా ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ ‘మొత్తం ఎన్నికల ప్రచారంలో అత్యంత నవ్వులు పూయించే క్లిప్ ఇదే’ అని రాసుకొచ్చారు.