calender_icon.png 18 November, 2025 | 11:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవం వేడుకలు

18-11-2025 10:12:27 PM

జడ్చర్ల: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట(డాక్) ఐబి బంగ్లా సమీపంలో 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవాలయంలో శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవత విగ్రహ ప్రతిష్టాపన 10వ వార్షికోత్సవాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవతకు, అమ్మవారి సింహ వాహనానికి అభిషేక ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవత విగ్రహ ప్రతిష్టాపన 10వ వార్షికోత్సవ ప్రత్యేక పూజలలో భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ వ్యవస్థాపకులు, దేవాలయ కమిటీ అధ్యక్షులు గోనెల నరేందర్ మహేశ్వరి దంపతులు, ఉపాధ్యక్షులు గుండు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి జి. విజయ్ కుమార్, కార్యదర్శులు బుక్క శివ కుమార్, ఉల్లి యాదగిరి, మిద్దె నాగరాజు, భక్తులు పోల శ్రీనివాసులు అరుణమ్మ దంపతులు, రామారావు, రాజేష్, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.