18-11-2025 10:11:09 PM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఇసుక వాహనాలు ఇటువైపుగా రావద్దు..
వెంకటాపురం(నూగూరు) (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వాహనాలు వెంకటాపురం వైపుగా వచ్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని మండల పరిధిలోని ఆలబాక గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని ఏకనగుడం గ్రామం నుండి వాజేడు మండలం జగన్నాధపురం గ్రామం వరకు ఇసుక లారీల కారణంగా రోడ్లు పూర్తిగా ధ్వంసమై ఈ ప్రాంత ప్రజలు అటువైపుగా ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు వాపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఇసుక లారీలు వెంకటాపురం మండలం వైపు రావద్దంటూ మంగళవారం ఆలుబాక గ్రామంలో స్థానికులు పార్టీలకతీతంగా లారీలను అడ్డుకున్నారు.
ఇసుక లారీల కారణంగా రహదారులు పూర్తిగా ధ్వంసం అవ్వడమే కాక రహదారి పక్కనే ఉన్న పంట పొలాలు తీవ్రంగా నష్టపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తీసుకెళ్లారిన కారణంగా దుమ్ము దూళి పెరిగిపోయి ప్రజలు శ్వాసకోస సంబంధిత వ్యాధుల పడడం విద్యార్థులు పాఠశాలలకు హాజరవ్వాలంటే ఇబ్బందులకు గురికావడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని వారు వాపోయారు. అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం అంబులెన్స్లు ఆ రహదారి గుండా వెళ్లాలంటే కనీసం దారి సౌకర్యం సక్రమంగా లేని పరిస్థితి నెలకొన్నదని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆ వైపుగా ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇసుక లాలన కారణంగా రాగాల జాన్సన్ తో పాటు ప్రజారాజ్యం క్షీణించి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా పక్క జిల్లాకు చెందిన ఇసుక లారీలను సైతం ఈ ప్రాంతంగానే మళ్లించడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులు మంత్రి ఇకనైనా ఈ ప్రాంత పై దృష్టి సారించి ప్రజల ఇబ్బందులు తొలగించేలా రహదారి మరమ్మతులు చేపట్టాలని ఇసుక లారీల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని వారు కోరుతున్నారు. అధికారులు ఈ విషయంపై స్పందించకపోతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఇసుక లారీలు ఈ ప్రాంతం గుండా ఇకపై వెళ్లనిచ్చేది లేదని వాటిని అడ్డుకుంటామని స్థానికులు హెచ్చరించారు.
వెంటనే రహదారి మరమ్మతులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అలబాక గ్రామంలో ఇసుక లారీలు ఆపడం కారణంగా సుమారు మూడు గంటల పాటు వాహనాలు రాకపోగాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజా రవాణా వ్యవస్థకు ఏమాత్రం అంతరాయం లేకుండా కేవలం ఇసుక లారీలను మాత్రమే నిరుద్యోగ చేస్తామంటూ వారు ప్రకటించారు. ఈ నిరసన కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నేతలతో పాటు సిపిఎం పార్టీ నాయకులు ఈ నిర్ణయానికి పూనుకున్నారు. ఇకనైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.