calender_icon.png 18 July, 2025 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి మత్తులో యువత..

18-07-2025 12:00:00 AM

  1. మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపేనా?
  2. సులభంగా పట్టణానికి చేరుతున్న గంజాయి? 
  3. తల్లిదండ్రులదే బాధ్యత..కదలికల పై దృష్టి పెట్టాలి

విద్యార్థులు యుక్త వయసులో విద్యాబుద్ధులు నేర్చుకుని, ఉన్నత విద్య, ఉద్యోగాలు సాధించాల్సిన యువత గంజాయికి అలవాటుపడి తమ బంగారు భవితను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు.

వనపర్తి, జూలై 17 ( విజయక్రాంతి ) : వి ద్యార్థులు యుక్త వయసులో విద్యాబుద్ధులు నేర్చుకుని, ఉన్నత విద్య, ఉద్యోగాలు సాధించాల్సిన యువత గంజాయికి అలవాటు ప డి తమ బంగారు భవితను చేజేతులా నా శనం చేసుకుంటున్నారు. కుటుంబానికి, గ్రా మానికి మంచి పేరు తెస్తాడని తల్లిదండ్రులు కలలు కంటుంటే, వీరు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.

నాడు పెద్ద పట్టణాలకే పరిమితమైన గంజాయి భూతం నేడు జిల్లా, మండల, గ్రామాలకు పాకింది. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడు తూ చోరీలకు పాల్పడుతూ, ఇతరుల పై దా డులు చేస్తూ ప్రమాదాలకు పాల్పడడం, ప్రే మ వ్యవహారాలు తదితర కారణాలే కాకుం డా తల్లిదండ్రులను డబ్బులు అడగడం ఇవ్వకపోతే దాడులు చేస్తున్నారని ఆరోపణలు కూ డా వినిపిస్తున్నాయి.

గంజాయి బారిన పడుతున్న యువత....

ఇంటర్, డిగ్రీ విద్యార్థులే లక్ష్యంగా పట్టణ, గ్రామ శివారులో ఉన్న గుట్టలను, అడ్డాగా చేసుకొని గంజాయి వ్యాపారానికి దిగారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. యువకులే మ త్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. కొందరు యువకులు మద్యం, మ త్తు పదార్థాలకు అలవాటు పడి తన విలువై న జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.

మత్తుకు అలవాటు పడిపోయిన యువకులు నేరాలకు అలవాటు పడిపోతున్నారు. కొత్త ప్రపంచం ఒకరితో ఒకరు స్నేహం చేస్తూ గం జాయి వ్యసనాన్ని అంటురోగంగా చేసుకుం టూ మత్తే ప్రపంచంగా గంజాయికి బానిస అవుతున్నారు. తొలి దశలో గుర్తించలేని తల్లిదండ్రులు ఆలస్యంగా తెలుసుకొని తమ పి ల్లలకు కౌన్సిలింగ్ లు ఇప్పిస్తూ మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.

సులభంగా పట్టణానికి చేరుతున్న గంజాయి....

పోలీసులు, ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణ లేక పట్టణంలోని పలు కాలనీల్లో రహ స్యంగా గంజాయి విక్రయాలు సాగుతున్నా యి. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సులభంగా వనపర్తి పట్టణానికి చేరుకుంటున్నాయి. ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాల ద్వారా కొంతమంది గంజాయి సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది.

వనపర్తి పట్టణంలో కొంతమంది గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలను ఉపాధి అవకాశాలుగా చే సుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సరఫరా చేసేవారు, విక్రయాలు జరిపేవారు, వి నియోగించుకునేవారికి సంబంధించి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సరైన దృష్టి సా రించకపోవడంతో మత్తు పదార్థాలు వినియోగం రోజురోజుకు పెరిగిపోతోందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి 

 ప్రధానంగా ఈ కాలనీలలోనే..

పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్ యార్డ్, శ్రీనివాసపురం, రాంనగర్, పీర్లగుట్ట, పాన్ గల్ రోడ్డు, ఖాసీంనగర్ రోడ్డు మున్సిపాలిటీలో కొత్తగా చేరిన మరికొన్ని కాలనీ ల్లో గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం జోరుగా సాగుతోందన్న ప్రచారం లో ఉంది .

మధ్య వయస్కులు, యువకుల తో పాటు కొన్ని చోట్ల విద్యార్థులు కూడా మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు స మాచారం. ఇందులో భాగంగానే పట్టణంలో కొన్ని చోట్ల గొడవలు, రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపేనా....?

మత్తు పదార్థాల వినియోగ రహిత జిల్లా ను చేస్తామని గతంలో విస్తృత ప్రచారం చేసి న అధికార యంత్రాంగం ఇప్పుడు చేతులు ఎత్తివేయడంతో పరిస్థితులు రోజురోజుకూ అదుపు తప్పుతున్నాయన్న విమర్శలు బలం గా వినిపిస్తున్న మాటలు . ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకొని మత్తు పదా ర్థాల వినియోగం పై ఉక్కు పాదం మోపాలని పలువురు సూచిస్తున్నారు.

 తల్లిదండ్రులదే బాధ్యత... కదలికల పై దృష్టి పెట్టాలి..

పిల్లల కదలికలను తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం ఉంది. ఒకసారి వ్యస నాల బారిన పడితే వాటి నుంచి తప్పించుకునేందుకు శ్రమించాల్సి వస్తుంది. ఒత్తిడి కారణంగానో, ఒంటరితనం భావనతో కొం దరు, చెడు స్నేహాలతో మరికొందరు, ఈ ఊబిలోకి దిగుతున్నారు. ఒక్కసారి మద్యం, గంజాయి తాగితే, మనసుకు దాని పట్ల ఆకర్షణ పెరిగిపోయి.

మానసిక సంఘర్షణకు లోనవుతుంటారు. మెదడును ఉత్తేజపరిచే మద్యం గంజాయి క్రమంగా దానికి బానిసను చేస్తుంది. తర్వాత మెదడు చురుకు దనం కోల్పోతుంది. మానసిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది.

గంజాయి కేసుల వివరాలు ఇలా.... 

2022 లో ఒకటే కేసు నమోదు కాగా.. పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకొని 120 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2023లో మూడు కేసులలో ఏడు గురిని అదుపులోకి తీసుకొని నాలుగు కిలో ల 399 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.2024 లో రెండు కేసులు నమోదు కాగా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

వారి నుండి 207 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2025 జూలై 16 న జిల్లా కేంద్రం లోని పాత వ్యవసాయమార్కెట్ యార్డ్ వద్ద ఇద్దరిని అదుపులోకి తీసుకుని 1.50 కేజీ ల గంజాయి స్వాధీనం చేసుకుని కేసును నమోదు చేశారు

కఠిన చర్యలు తీసుకుంటాం.. వనపర్తి పట్టణ ఎస్ ఐ హరిప్రసాద్

గంజాయికి బానిసలు అవుతున్న యువ త, చెడువ్యననాలు పట్టకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటూ ప్రత్యేక శ్రద్ద తీ సుకోవాలి అని వనపర్తి పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపారు. యువత తమ ఉజ్వల భవిష్యత్తును, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు అని గంజాయి రవాణా చేసిన, అమ్మిన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం అని, నమాచారం తెలిస్తే వెంటనే 100కు సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం.