calender_icon.png 8 December, 2025 | 9:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డివైడర్‌ను ఢీకొని వ్యక్తి మృతి..

08-12-2025 08:04:36 PM

ఉప్పల్ (విజయక్రాంతి): మోటార్ సైకిల్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం... ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ లో నివాసం ఉంటున్న అల్లి సిద్దు(24) ప్రైవేటు ఉద్యోగి ఆదివారం రోజున రాత్రి 11:30 ప్రాంతంలో తన ద్విచక్రవాహనంపై రామంతపూర్ నుండి ఉప్పల్ మెట్రో స్టేషన్ వైపు వెళ్తుండగా కేంద్రీయ విద్యాలయం సమీపంలో బైకు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని కింద పడిపోయాడు. తలకు తీవ గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సిద్దు సోమవారం నాడు మృతిచెందాడు. మృతుడు సోదరుడు సాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.