22-10-2025 07:40:32 PM
కొండపాక: సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మార్వాడి దేవదానం(45) అనే వ్యక్తి తన వ్యవసాయ పొలంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. కుక్కునూరు పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు దేవదానం ఎస్సీ మాదిగ వర్గానికి చెందినవాడు. వృత్తి రీత్యా డీసీఎం డ్రైవర్. కుటుంబ పోషణ కోసం సరైన పని చేయడం లేదని భార్య మార్వాడి మమత మందలించడంతో మనస్తాపానికి గురై తన పొలానికి వెళ్లి ఉరేసుకున్నాడు. ఈ ఘటనపై కుకునూర్ పల్లి పోలీసులు క్రైం నంబర్ 229/2025, సెక్షన్ 194 బిఎన్ఎస్ఎస్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.