22-10-2025 07:37:00 PM
కోదాడ: ఈ నెల 25న హుజూర్ నగర్ జరగనున్న జాబ్ మేళాను కోదాడ పట్టణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో టౌన్ సీఐ శివశంకర్ తెలిపారు. ఈ మేళాలో సుమారు 150 కంపెనీలు పాల్గొని, సుమారు 5000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని కోదాడ టౌన్ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.