calender_icon.png 15 December, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఎస్‌పిఎస్ హైస్కూల్‌ సిల్వర్ జూబ్లీ వేడుకలు

14-12-2025 06:19:25 PM

హైదరాబాద్‌: కొంపల్లిలోని ఎస్‌పిఎస్ హై స్కూల్లో సిల్వర్ జూబ్లీ సందర్భంగా వార్షికోత్సవం ‘సంకల్ప్ 2025’ ను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పాఠశాల కట్టుబడిన విధానాన్ని చాటి చెప్పింది. ఈ వేడుకల సందర్భంగా పాఠశాల ప్రాంగణం క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, యువత ఉత్సాహంతో పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. వేడుకలు నాలుగు హౌస్‌ల విద్యార్థుల అద్భుతమైన మార్చ్‌పాస్ట్‌తో ప్రారంభమయ్యాయి. అనంతరం సంప్రదాయ దీప ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు.

ఈ వేడుకకు వైస్ ప్రెసిడెంట్ & డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ సాయిలేష్ సంపతి, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి దీపిక సంపతి, హెడ్ మిస్ట్రెస్ శ్రీమతి వై. శారద హాజరయ్యారు. “‘సంకల్ప్’ అంటే దృఢ సంకల్పమనీ, తమ విద్యార్థులు ఉత్సాహభరితమైన పాల్గొని ఆ సంకల్పాన్ని సాకారం చేశారంటూ డాక్టర్ సాయిలేష్ సంపతి వ్యాఖ్యానించారు. క్రమశిక్షణ, విలువలు పెంపొందిస్తూ ఎస్‌పిఎస్ హై స్కూల్ యువ మనసులకు నిరంతరం ప్రేరణనిస్తోందన్నారు. సంకల్ప్ 2025 తమ లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోందనీ, క్రీడలు నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసంతో పాటు సహనశక్తిని పెంపొందిస్తాయనీ  అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి దీపిక సంపతి చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి.