calender_icon.png 15 December, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శుద్ధ్ విలాస్ ప్రారంభించిన యువ హీరో శ్రీ విష్ణు

14-12-2025 06:21:51 PM

హైదరాబాద్: భాగ్యనగర భోజన ప్రియులకు పసందైన వంటకాలను అందించేందుకు సరికొత్త రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. మల్కాజ్గిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన శుద్ధ్ విలాస్- ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్‌ను యువ కథానాయకుడు శ్రీ విష్ణు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ విష్ణుతో పాటు నిర్వాహకులు శశికాంత్ శ్రీరామ్‌, ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల, కోన వెంకట్, మల్కాజ్‌గిరి బ్రాంచ్ భాగస్వాములు రాజీవ్, రాజా శేఖర్, హుస్సేన్, వెంకట్ మార్తాండ్ పాల్గొన్నారు. నేటి ఆధునిక జీవనశైలికి తగిన విధంగా వంటకాలు అందించడం అభినందనీయమని సినీ కథానాయకుడు శ్రీ విష్ణు అన్నారు.

నగరంలో ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్లు చాలా అరుదుగా ఉన్నాయని.. మంచి రుచికరమైన శాఖాహార వంటకాలను అందించేందుకు రెస్టారెంట్ ను అందుబాటులోనికి తీసుకురావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రజలు ఎంతో ఇష్టంగా ఆస్వాదించే శాకాహారంతో విభిన్న రుచులతో బెస్ట్ క్వాలిటీ అండ్ క్వాంటిటీతో అందించడమే తమ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. తమ సంస్థలో పనిచేస్తున ఉద్యోగులకు ఉపాధి కల్పన పెంచడం కూడా ప్రధాన ఉద్దేశ్యమన్నారు. మంచి రుచి, నాణ్యమైన వంటకాలను ప్రజలకు అందిస్తామని, మరిన్ని శాఖలు కూడా ప్రారంభించబోతున్నట్టు వెల్లడించారు.