calender_icon.png 12 July, 2025 | 6:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్‌లో మాట్లాడుతున్న మందడి అనిల్ యాదవ్

12-07-2025 12:43:46 AM

పార్టీ కోసం కష్టపడి పని చేస్తే పదవులు వస్తాయి

రాజ్యసభ సభ్యులు మందాడి అనిల్ యాదవ్

నిర్మల్,(విజయక్రాంతి): ఏ పార్టీలోనైనా కష్టపడి పనిచేసే వ్యక్తులకు పార్టీ పదవులు తప్పకుండా వస్తాయని తామంతా ఈ స్థాయిలో ఉండడానికి కార్యకర్తలే ప్రధాన కారణమని పార్లమెంట్ ఉమ్మడి అదిలాబాద్ ఇంచార్జ్ రాజ్యసభ సభ్యులు మందాడి అనిల్ యాదవ్ అన్నారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలోని మయూరి హోటల్ లో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ర్టంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతల్లో కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర పాలనలో ప్రజలకు ఆరు గ్యారంటీలను హామీలు ఇచ్చి అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి పార్టీ కోసం కష్టపడి పనిచేసే నాయకులకు పదవులను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పార్టీలో సీనియర్ జూనియర్లో తేడా లేదని కష్టపడి పని చేస్తే వారికి అవకాశం దక్కుతుందని కార్యకర్తలకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో   మాజీ ఏ ఇంద్రకరణ్ రెడ్డి ఎమ్మెల్సీ దండేవిటల్ ఖానాపూర్ ఎమ్మెల్యే వేడుమ బొజ్జు పటేల్ ముధోల్ మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్ జి విట్టల్ రెడ్డి గ్రంథాలయ చైర్మన్ అర్జుమత్ అలీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

రాజ్యసభ సభ్యుడుకి సన్మానం

అదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్చార్జిగా నియమితులైన రాజ్యసభ సభ్యులు మందాడి అనిల్ యాదవ్ గారిని నిర్మల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ యాదవ సంఘం నాయకులు శ్రీకాంత్ యాదవ్ ఘనంగా సన్మానం చేశారు. అనిల్ ను శాలువాతో సత్కరించి మెమొంటో బహుకరించారు ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.