calender_icon.png 19 May, 2025 | 8:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి

19-05-2025 12:00:00 AM

  1. అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఒత్తిడి పెంచాలి
  2. రాజకీయ పార్టీల సవాళ్లు, ప్రతి సవాళ్లతో సమస్య పక్కదారి పట్టించొద్దు
  3. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, మే18 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీల సవాళ్లు, ప్రతి సవాళ్లతో సమస్య పక్కదారి పట్టించద్దని కోరారు.

ఈ మేరకు  ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో 14 బిసి సంఘాల సమావేశం బిసి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిధిగా ఆర్. కృష్ణయ్య హాజరై ప్రసంగించారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచుతూ అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన నేపథ్యంలో అమలు చేయాలని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. దమ్ముంటే ఎన్నికలు జరపాలని  ఎన్నికలకు వెళ్లాలని కోరడం బిఆర్‌ఎస్ పార్టీ ప్రయోజనాల కోసమేనాన్నరు. ఈ విషయంలో ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం జరిపి నిపుణులతో చర్చించాలన్నారు.

కేంద్ర ప్రభుత్వం మీద నెట్టి చేతులు దులుపుకోవాలని చూడడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే చేసిన వాగ్దానం ప్రకారం రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర బిసి వ్యతిరేక చర్యలకు ప్రభుత్వం పాల్పడుతుందన్నారు. సమాచార శాఖ కమీషనర్లలో ఒక బీసీకి ఇవ్వరా? ఇంత అన్యాయమా? బిసి ఎజెండా ఏమైందని ప్రశ్నించారు. ఇకనైనా మిగిలిన 3 కమిషనర్ పోస్టులలో మొత్తం బీసీలకు నియమించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఒకవైపు ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతంకు రిజర్వేషన్లు పెంచుతామని అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు.

ఇంకొక వైపు రాహుల్ గాంధీ జనాభా ప్రకారం బీసీలకు పదవులు ఇస్తామని వరుస ప్రకటనలు ఇస్తున్నారన్నా రు. కాంగ్రెస్ పార్టీ జనాభా గణనను తెలంగాణ బీసీ ఎజెండా దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తూ తెలంగాణ మోడల్ ఆదర్శంగా తీసుకున్నారంటూ రాజీవ్ గాంధీ ప్రకటనలను గుప్పిస్తున్నారని అన్నారు.

తెలంగాణ మోడల్ అంటే ఇలా ఒక్కరికీ కూడా పదవిలో కూడా బీసీలకు ఇవ్వకపోవటమేనా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బిసి నాయకులు జిల్లపల్లి అంజి, పగిళ్ళ సతీష్, పల్లగొర్ల మోడిరాందేవ్, వీరన్న, నరేశ్ గౌడ్, తల్లూరి కౌశిక్, చంద్రశేకర్, బాలయ్య, శివముదిరాజ్, ప్రభాకర్, మద్దెల వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.