12-01-2026 12:32:00 AM
చిట్యాల, జనవరి 11(విజయ క్రాంతి): చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో మండల స్థాయి కబడ్డీ మరియు వాలీబాల్ పోటీలను తెలంగాణ రాష్ట్ర డైయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అమిత్ కుమార్ రెడ్డి సహకారంతో కీ.శే.సోమనబోయున నాగేష్ జ్ఞాపకార్థంగా ఆటల పోటీలను నిర్వహించారు. ఆదివారం ఈ ఆటల పోటీలను గ్రామ సర్పంచ్ సాగర్ల భాను శ్రీ భిక్షం, ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్ తో కలిసి ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ సాగర్ల భాను యూత్ సభ్యులకు ఉచితంగా వాలీబాల్ మరియు నెట్ అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా కీ.శే. సోమనబోయున నాగేష్ జ్ఞాపకార్థం గా గ్రామంలోని క్రీడలు నిర్వహిస్తున్నామని క్రీడలు శారీరక మానసిక ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతతను కల్పిస్తాయని అన్నారు. కావున యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. క్రీడల వల్ల గ్రామంలోని ఐక్యత భావం పెరుగుతుందని ప్రతి ఒక్కరు ఆటలు ఆడి తమ యొక్క ప్రతిభను నిరూపించుకోవాలని క్రీడాకారులకు, యువతకు తెలియజేశారు.
వార్డు సభ్యులు, వ్యాయామ ఉపాధ్యాయుడు గంగాపురo రాము, మేడబోయున శ్రీను స్వాతి, మర్రి పూలమ్మ, జనపాల శ్రీను, ఎలిమినేటి హరీ ప్రసాద్, వనమా వెంకటేశ్వర్లు, యాదవ సంఘం అధ్యక్షులు బొడ్డు శ్రీను, మర్రి రమేష్, గుత్తా రవీందర్ రెడ్డి, జనపాల గణేష్, సోమనబోయున వెంకటేష్, బెలిజ పరమేష్, వ్యాయామ ఉపాధ్యాయుడు కొండా పరమేష్,సాగర్ల లింగస్వామి పాల్గొన్నారు.