calender_icon.png 12 January, 2026 | 10:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే రాజ్యాధికారం

12-01-2026 12:30:40 AM

మఠంపల్లి, జనవరి 11: అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం వల్లనే రాజ్యాధికారం సాధించామని ప్రజలందరికీ ప్రజాపాలన అందించగలుగుతున్నా మని సూర్య పేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రం సర్పంచ్ ఏసుమళ్ళ వీరలక్ష్మీ పాపయ్య తెలిపారు.స్పందన సాహిత్య కళా వేదిక ఆధ్వర్యంలో మఠంపల్లి సర్పంచ్ ఏసుమళ్ళ వీరలక్ష్మీ పాపయ్యకి ఆత్మీయ సన్మానం చేశారు.స్పందన సాహిత్య కళా వేదిక అధ్యక్షుడు కర్ల శ్రీనివాస్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం బుక్ ను అంబేద్కర్ ఫోటోను బహుకరించి శాలువాతో సర్పంచ్ ని ఘనంగా సన్మానించారు.

శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం వలన భారత ప్రజలందరికీ సమాన హక్కులు సమాన బాధ్యతలు లభించి సమాన త్వంతో ముందుకు వెళుతున్నామని అంబేద్కర్ ఆశయాలు లక్ష్యాలు సిద్ధాంతాలు సాధించేందుకు అందరూ కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాయిరాల లింగయ్య, మామిడి మరియన్న, కందుల మోష, కామళ్ళ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.