calender_icon.png 24 May, 2025 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పది ఫలితాల్లో ‘మానేరు’ ప్రభంజనం

02-05-2025 12:11:56 AM

కరీంనగర్ క్రైమ్, మే 1: పదో తరగతి వార్షిక ఫలితాల్లో కరీంనగర్, జగిత్యాలలోని మానేరు విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత ఫలితాలతో విజయకేతనం ఎగురువేశారని విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి తెలిపారు.

జీ లాస్యప్రియ 576 మార్కులతో టాపర్‌గా నిలిచిందని చెప్పారు. ఎస్‌బీ విష్ణుశ్రీ 575, జి ప్రజ్ఞ 574, డి మహిత, ఆర్ నందిత 566, ఎ విక్రమ్‌రాజ్ 563, పి పవన్‌తేజ్ 562, డి స్వరిత్‌రాజ్ 560 మార్కులు సాధించినట్టు వెల్లడించారు. 46 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించినట్టు పేర్కొన్నారు.

ప్రతి సంవత్సరం తమ విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణతను సాధిస్తున్నారని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను అనంతరెడ్డి, డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు అభినందించారు. జాతీయ స్థాయిలో సెమ్స్ ఒలింపియాడ్‌లోనూ మానేరు విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంకులను కైవసం చేసుకున్నట్టు అనంతరెడ్డి తెలిపారు.