02-05-2025 12:12:11 AM
ఎమ్మెల్యే బాలునాయక్
దేవరకొండ, మే 1: కార్మికుల సమిష్టి పోరాటాలతోనే మే డే ఆవిర్భవించిందని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు. మే డేను పురస్కరించుకొని గురువారం దేవరకొండలో ఐఎన్టీయూసీ 327, కొండమల్లేపల్లిలో ఆల్మోటార్ వెహికల్ మెకానిక్ యూనియన్ అధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఐఎన్టీయూసీ జెండా ఆవిష్కరించి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజాప్రభుత్వ ప్రగతి ఫలాలు అన్ని వర్గాలకు చేరుతున్న వేళ కార్మికుల జీవితాల్లో సరికొత్త వెలుగులు విరజిల్లాలని ఆకాంక్షించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐఎన్టీయూసీ ముందు వరుసలో ఉంటుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, శ్రేణులు, ఐఎన్టీయూసీ నాయకులు పాల్గొన్నారు.