29-04-2025 12:00:00 AM
రైతు ఆర్థిక అభివృద్ధికి కృషి
కోల్ స్టోరేజీ ఏర్పాటుతో రైతులకు మరింత లాభం
ఎమ్మెల్యే గడ్డం వినోద్
బెల్లంపల్లి అర్బన్, ఏప్రిల్ 28 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మ్యాంగో మార్కెట్ కల ఎట్టకేలకు నెరవేరింది. దశాబ్దాలుగా మామిడి రైతులు, ప్రజలు మ్యాంగో మార్కె ట్ కోసం ఎదురుచూస్తున్నారు. మ్యాంగో మార్కెట్ నిర్మాణం జరిగి ఎంతో కాలమైన మామిడికాయల కొనుగోలు సౌలభ్యం కానరాలేదు. బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ పక్కన రూ. కోటి 70 లక్షలతో నిర్మించిన మ్యాంగో మార్కెట్‌ను సోమవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడారు. ఇంతకాలం రైతులు కొనుగోలు కేంద్రం సౌలభ్యం లేక దూర ప్రాంతాలకు వెళ్లి తీవ్రంగా నష్టపో పోయారని వాపోయారు. మామిడి రైతుల సౌలభ్యం కోసం మ్యాంగో మార్కెట్ కొనుగోళ్ళు ఇకనుంచి బెల్లంపల్లి నుంచే సాగుతా యన్నారు.
రైతు ఆర్థిక అభివృద్ధికి సాయ శక్తుల కృషి చేస్తానన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో మామిడి రైతులకు మామిడి మార్కెట్ లేక మహారాష్ట్ర, నాగపూర్ రాష్ట్రాలకు వెళ్లి అమ్ముకునే అఘాత్యం ఇకనుంచి రైతులకు లేదని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రంతో ఎన్నో ఏళ్ళుగా మామిడి రైతుల బాధలు ఇక నుంచి దూరం కానున్నాయన్నారు.
బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలోనే మామిడి కాయల విక్రయాలకు మార్కెట్‌ను రూ. కోటి 70 లక్షల వ్యయంతో నిర్మించినప్పటికీ గత పాలకుల నిర్లక్ష్యంతో నిరుపయో గంగా మారిందన్నారు. మామిడికాయల ఓమార్కెట్ ప్రారంభంతో రైతుల కళ్ళలో ఆనందం చూడటం సంతోషంగా ఉందన్నారు. ప్రతి మామిడి సీజన్‌లో మామిడి కాయలు అమ్ముకోవడానికీ దూర ప్రాంతాలకు వెళ్లి గిట్టుబాటు ధర రాక రైతులు పడే కష్టాలు తెలుసునన్నారు.
అందుకే ఇదే సీజన్‌లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతుల కష్టాలు తీర్చడానికి ఫ్రూట్ ఎక్స్ కంపెనీ సహకారంతో రైతులకు గిట్టుబాటు ధరతో మార్కెట్‌ను ఏర్పాటు చేశామ న్నారు. మామిడి మార్కెట్ ఏర్పాటుతో నెన్నెల, కన్నెపల్లి, భీమిని, తాండూరు, పాత బెల్లంపల్లి లోని రైతులకు మార్కెట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు.
ఈ సౌకర్యంతో పండ్ల తోటల రైతుల్లో ఆసక్తి పెరుగు తుంద న్నారు. మామిడి తోటలకు నియోజకవర్గంలోని సారవంతమైన భూములు ఉన్నా య న్నారు. రైతులు వివిధ పండ్ల తోటలు వేసి ఇదే మార్కెట్‌లో గిట్టుబాటు ధరకు అమ్ముకోవచ్చన్నారు.
కోల్ స్టోరేజీ కూడా ఏర్పాటు చేసి రైతులకు మరింత లాభం చేకూర్చే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి ఏర్పాటుకి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ కారుకూరి రామచందర్, టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య, అధికారులు, ప్రజా ప్రతినిధులు, వ్యాపారులు, తదితరులు పాల్గొన్నారు.