29-04-2025 12:00:00 AM
ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
శంషాబాద్ మండలం కవేలిగూడలో అవగాహన సదస్సు
రాజేంద్రనగర్, ఏప్రిల్ 28: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతితో రైతులకు సంబంధించిన అన్ని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం శంషాబాద్ మండలంలోని కావేలిగూడ గ్రామంలోని ఎంఎం గార్డెన్ లో ఏర్పాటు చేసిన భూ భారతి ఆర్ వో ఆర్ కొత్త చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో అయన మాట్లాడారు. భూభారతి చట్టంతో రైతులకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందని తెలిపారు. పెండింగ్ లో ఉన్న సాదా బై నామతో పాటు అన్ని రకాల సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి వెంకట్ రెడ్డి, తహసిల్దార్ రవీందర్ దత్, ఎంపీడీవో మున్ని , ప్రజాప్రతినిధులు రైతులు పాల్గొన్నారు.