22-05-2025 12:04:24 AM
మణికొండ మే21: మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని తిరుమలహిల్స్ కాలనీ పార్కును హైడ్రా అధికారుల ఆదేశాల మేరకు మణికొండ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు కబ్జా చెర నుంచి విడిపించారు. బు ధవారం ఉదయం నార్సింగి పోలీసుల బందోబస్తు మధ్య రెండు జేసీబీల సహాయంతో 6వేల గజాల పార్క్ స్థలం చుట్టూ వేసిన రే కుల ఫెన్సింగ్ ను అధికారులు తొలగించా రు.
ఈ విషయం తెలుసుకున్న బాధితులు ఘటనా స్థలానికి వచ్చి తమకు నోటీసులు ఇవ్వకుండా ఎలా మా ఫెన్సింగ్ కూల్చివేస్తారని అధికారులతో వాగ్వాదానికి దిగారు.
తమ వద్ద ఉన్న డాక్యుమెంట్స్ తో కోర్టులో కే సు వేశామని, ఇప్పుడు ఇంకా కేసు నడుస్తోందని, ఈ స్థలం వద్దకు ఎవరూ రాకూడదని కోర్టు ఆదేశాలు ఉన్నా, తిరుమలహిల్స్ కాల నీ ప్రతినిధులు, అధికారులు కలిసి తమపై దౌర్జన్యం చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు రేకు ల ఫెన్సింగ్ ను తొలగించి, ఈ స్థలం పార్క్ కు చెందినది అని, దీన్ని హైడ్రా కబ్జా నుండి కాపాడిందని బోర్డ్ పెట్టారు.
మాది హెచ్‌ఎండీఏ లేఅవుట్ - బాధితులు
మాది హెచ్‌ఎండీఏ లేఅవుట్ అని 200 8లో 119/87 పార్ట్ లో ఉన్న 3 ఎకరాల భూమిని కొని ఫ్లాట్స్ గా చేశామని బాధితు లు సోయెల్, అహ్మద్, అబూ హనీఫా, బషీ ర్ ఉన్నీసా, మసూద్ మొయిజుద్దీన్ తదితరు లు పేర్కొన్నారు. హైడ్రా, హెచ్‌ఎండీఏ, మణికొండ మున్సిపల్ అధికారులంతా ఏకప క్షంగా వ్యహరించి, రూపాయి రూపాయి కూ డబెట్టుకుని కొన్న, తమకు అన్యాయం చేస్తున్నారని బాధితులు అంటున్నారు.
ఈ స్థలం వివాదంపై తాము కోర్టుకు వెళ్లామని, కో ర్టులో కేసు నడుస్తుండగా, ఈ స్థలం వద్దని ఎవరూ రావొద్దని ఆదేశాల కాపీ చూపించి నా, అధికారులు వినకుండా లక్షల విలువ చే సే తమ ఫెన్సింగ్ ను తొలగించారని బాధితు లు అన్నారు. తమ స్థలం కానప్పుడు తమ ద గ్గర నుంచి ఎల్‌ఆర్‌ఎస్ డబ్బులు ఎలా తీసుకున్నారని వారు అంటున్నారు.
తాము ఎవ రి భూమిని కబ్జా చేయలేదని, డబ్బులు పెట్టి కొన్నామని, తమ లేఅవుట్ లోని స్థలాన్ని రోడ్లు, పార్కులకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామన్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు తమకు అడ్డుపడే ప్రతి ఒక్కరిపై చట్టపరిధిలోనే పోరాటం చేస్తామన్నారు.
మున్సిపల్ కమిషనర్ వివరణ
తిరుమలహిల్స్ కాలనీ పార్కు స్థలం కబ్జా కు గురైందని, దాన్ని కబ్జా చెరనుంచి విడిపించాలని హైడ్రా అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు బుధవారం పార్కు చుట్టూ ఉన్న ఫెన్సింగ్ ను తొలగించామని మణికొండ మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ వివరించారు.
నార్సింగి పోలీసుల సహకారంతో జేసీబీలను ఉపయోగించి, రేకుల ఫెన్సింగ్ ను తొలగించామని అన్నారు. స్థానికులు కొందరు ఈ స్థలం తమదని పేర్కొంటున్నారని, తమ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తో హై డ్రా అధికారులను సంప్రందించవచ్చని, అలాగే కోర్టులో కేసులు వేసుకోవచ్చని కమిషనర్ ప్రదీప్ కుమార్ స్పష్టం చేశారు.