calender_icon.png 25 July, 2025 | 8:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతదేహాల తారుమారు

24-07-2025 01:02:28 AM

న్యూఢిల్లీ, జూలై 23: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన ఇద్దరు ప్రయాణికులకు సంబంధించి తప్పు డు మృతదేహాలు చేరాయని బ్రిటన్‌కు చెందిన రెండు కుటుంబాలు తెలిపాయి. తమవారి మృతదేహాలను సరిగా గుర్తించలేదని ఆరోపించాయి. బాధిత కుటుంబాల డీఎన్‌ఏతో ఆ రెండు మృతదేహాల డీఎన్‌ఏలు మ్యాచ్ కాలేదని బ్రిటన్ కుటుంబాల తరఫు న్యాయవాది జేమ్స్ హీలీ తెలిపారు.

డీఎన్‌ఏ పరీక్షలు తర్వాత 13 లేదా 13 మృతదేహాలు బ్రిటన్‌కు పంపినట్టు చెప్పారు. అయితే వాటిలో రెండు మృతదేహాలు సంబంధిత కుటుంబాల డీఎన్‌ఏతో మ్యాచ్ కాలేదని ఆయన వెల్లడించారు. పరిహారం విషయంలో కూడా బ్రిటన్ కుటుంబాలు పలు ఆరోపణలు చేశాయి. మరోవైపు బుధవారం ఉదయం కాలికట్ అంతర్జాతీయదోహా బయల్దేరిన ఎయిరిండియా 375 విమానం సాంకేతికలోపంతో టేకాఫ్ అయిన రెండు గంటల అనంతరం సురక్షితంగా ల్యాండ్ అయింది.