24-07-2025 12:50:36 AM
పట్నా, జూలై 23: బీహార్‌లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్ కార్యక్రమం రాజకీయ దుమారం రేపుతోంది. తాజాగా బుధవారం అసెంబ్లీలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సీఎం నితీశ్ కుమార్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ‘అప్పుడు నువ్వు చిన్న పిల్లాడివి. మీ తల్లిదండ్రులు చెరో ఏడేళ్లు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అప్పటి పరిస్థితులు మీకు తెలుసా? అప్పుడు నేనూ మీతో ఉన్నారు.
కానీ మీ పద్ధతి సరిగా లేదు కాబట్టే ఇవాళ బీజేపీతో చేతులు కలిపా. అలాగే కలిసి ఉంటాం. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఏం చేయాలో ప్రజలకు తెలుసు’ అని పేర్కొన్నారు. తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. తాము ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకం కాదని.. కానీ ఆ ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదని పేర్కొన్నారు. నకిలీ ఓట్లతో తాము గెలిచి ఇక్కడికి వచ్చామా అని ప్రశ్నించారు.