18-12-2025 12:30:44 AM
చర్ల, డిసెంబర్ 17 (విజయక్రాంతి): చత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్‌లో బుధవారం 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ముగ్గురు ఏఎస్‌ఎమ్, ఇద్దరు జిల్లా కమిటీ సభ్యులు ఉన్నారు. వారి తలలపై మొత్తం రూ.30.7 లక్షల బహుమతి ఉంది. వారంతా నారాయణపూర్ ఎస్పీ రాబిన్సన్ గుడియా ముందు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులు అబుజ్‌బడ్ లోయలలో చురుకుగా ఉన్నట్టు తెలిసింది.