18-12-2025 12:31:58 AM
బూర్గంపాడు,డిసెంబర్ 17,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలం ఉప్పుసాకలో అర్హత ఉన్న ప్రతి పేదవానికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా కృషి చేస్తానని సర్పంచ్ వర్స మంగమ్మ హామీ ఇచ్చారు. బుధవారం ఉప్పుసాకలో లబ్ధిదారులు కొర్స గాంధీ, గుగులోత్ నాగేశ్వరరావుల గృహ నిర్మాణ స్లాబ్ పనులకు ఆమె కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు.
వార్డు సభ్యులు, కాంగ్రెస్ నేతలతో కలిసి లబ్ధిదారులను అభినందించారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తామన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు కందుల రాంబాబు, మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు,చంటి, కొర్సా వెంకటేష్, ముర్రం రాంబాబుతదితరులు పాల్గొన్నారు.