calender_icon.png 24 July, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి, డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ను నిర్మూలించాలి

23-07-2025 07:32:14 PM

ప్రముఖ మట్టికవి బెల్లి యాదయ్య..

కట్టంగూర్ కేతపల్లి నకిరేకల్ మండలాల్లో పోస్టర్ ఆవిష్కరణ.. 

నకిరేకల్ (విజయక్రాంతి): గంజాయి, డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ను నిర్మించాలని వాటికి విద్యార్థులు, యువకులు దూరంగా ఉండాలనీ ప్రముఖ మట్టి కవి నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బెల్లియాదయ్య కోరారు. బుధవారం డి.వై.ఎఫ్.ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ గంజాయి ఆన్లైన్ బెట్టింగ్స్ నిర్మూలనకై ఈ నెల 24 నుంచి ఆగస్టు 02 వరకు సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ముద్రించిన పోస్టర్ ను నకిరేకల్ లో మట్టికవి బెల్లి యాదయ్య, కట్టంగూర్ లో ఎస్సై రవీందర్, కేతేపల్లిలో తహసీల్దార్ రమాదేవి డి.వై.ఎఫ్.ఐ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజ మార్పు కోసం, డ్రగ్స్ ను గంజాయిని అరికట్టాలని జిల్లా వ్యాప్తంగా డివైఎఫ్ఐ సైకిల్ యాత్ర నిర్వహించడం అభినందనీయమన్నారు.

ప్రస్తుతం సమాజాన్ని డ్రగ్స్ అనే మహమ్మారిపట్టిపీడిస్తుందన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టుబడి పెట్టి నష్టపోయి అనేకమంది యువకులు ఆత్మహత్యలుపాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ గంజాయి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని నివారించాలని వారు కోరారు.డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ మాట్లాడుతూ రేపు నకిరేకల్ లో యువ చైతన్య సైకిల్ యాత్రప్రారంభంఅవుతుందన్నారు. జిల్లావ్యాప్తంగా ఆరు నియోజకవర్గ కేంద్రాలను 25 మండలాలలో ఈ సైకిల్ యాత్రనిర్వహిస్తున్నామన్నారు.. యాత్రలో యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదంచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గద్దపాటి సుధాకర్ ,జిల్లా సహాయ కార్యదర్శి వడ్డగాని మహేష్  దాసరి శంకర్, గంట మల్లేష్ కక్కిరేణి కుమారస్వామి ప్రవీణ్, రాము  విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు.