23-07-2025 07:32:40 PM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): పట్టణంలోని కూరగాయల మార్కెట్ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణపు పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Mahbubnagar MLA Yennam Srinivas Reddy) అధికారులను ఆదేశించారు. కూరగాయల మార్కెట్ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ను ఆయన బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని నిర్మాణపు పనుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా ప్రజలకు వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నించాలని ఆయన సూచించారు. మార్కెట్ ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలని , ప్రతిరోజు మార్కెట్లో చెత్తను తొలగించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కమిషనర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, ఎన్ఎస్యుఐ కార్యదర్శి సంజీవరెడ్డి, ప్రవీణ్ కుమార్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు చిన్న , రాషెద్ ఖాన్, ఖాజా పాషా, ప్రశాంత్, అంజద్ తదితరులు పాల్గొన్నారు.