16-05-2025 12:05:55 AM
కడ్తాల్, మే 15 : కడ్తాల్ మండలంలోని మక్తమాధారం - నాగిరెడ్డిగూడ తండాకు బీటీ రోడ్డు మంజూరైంది. రెండు నెలల క్రితం రోడ్డు పనులను స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రా రంభించారు. కానీ గుత్తేదారు పనులు ప్రారంభించడంతో తండా ప్రజలతో పాటు ఆయా గ్రా మాల ప్రజలు సంబరపడ్డారు. ప్రారంభించిన పది రోజులకే గుత్తేదారు పనులు నిలిపివేశాడని గురువారం విజయ క్రాంతి దినపత్రికలో వార్త వెలువడింది.
స్పందించిన మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీత నర్సింహా, మాజీ సర్పంచి సులోచన సాయిలు రోడ్డుకు తాత్కాలిక మరమత్తులు సొంత ఖర్చులతో చేపట్టారు. ఆర్టీసీ బస్సులకు ఇబ్బంది లేకుండా రోడ్డును బాగుచేయడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. రోడ్డుకు మరమత్తులు చేయడంతో ఆయా గ్రామాల ప్రజలు విజయ క్రాంతి పత్రికకు ధన్యవాదాలు తెలిపారు.