30-08-2025 12:00:00 AM
కాజీపేట (మహబూబాబాద్), ఆగస్టు 29 (విజయ క్రాంతి): రైలు ద్వారా ఒడిశా రాష్ట్రంలోని ఛత్రపూర్ నుంచి మహారాష్ట్ర దాదర్ కు అక్రమంగా రైలులో గంజాయి రవాణా చేసేందుకు కాజీపేట రైల్వేస్టేషన్లో కోణార్క్ ఎక్స్ప్రెస్ నుంచి దిగిన ముగ్గురు వ్యక్తుల నుంచి 16 లక్షల విలువైన 32 కిలోల రెండు గంజాయిని హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే జంక్షన్ ప్రభుత్వ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు డి.ఎస్.పి కృపాకర్ తెలిపారు. ఈ సంఘటనలో ప్రతిభ కనబరిచిన జి ఆర్ పి ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, ఎస్ ఐ అభినవ్, సిబ్బందిని రైల్వే ఎస్పి చందన దీప్తి అభినందించారు.