29-08-2025 11:41:21 PM
ఘట్ కేసర్: ఘట్ కేసర్ మున్సిపల్ పరిధిలోని ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువు వద్ద జరుగుతున్న వినాయక నిమజ్జన ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు, మున్సిపల్ కమిషనర్ పి. రాజేష్ తో కలసి సందర్శించి పరిశీలించారు. అన్ని రకాల జాగ్రత్తలను పాటించాలని సూచించారు. అనంతరం ఘాట్ కేసర్ పోలీస్ స్టేషన్ సందర్శించి రికార్డులను పరిశీలించారు.