calender_icon.png 22 November, 2025 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి పట్టివేత

10-02-2025 12:00:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): హెచ్‌ఎంటీ కంపెనీలో ప్రవీణ్  అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఏపీలోని అరకు వద్ద గంజాయి కొని కారులో శనివారం హైదరాబాద్‌కు వస్తున్నాడు. కారును మరో డ్రైవర్‌కు అప్పగించగా.. ఆ కారు నగరంలోని సికింద్రాబాద్ జింఖా నా గ్రౌండ్స్ నుంచి అల్వాల్‌కు వెళ్తుండగా కారు డోర్లలో దాచిన 10 కిలోల గంజాయి ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు.

కారులోని డ్రైవర్లు తం  శేఖర్, పీ అనిల్‌కుమార్‌లను అరెస్ట్ చేశారు. ప్రవీణ్‌వర్మ పరారీలో ఉన్నాడు. మూసారాం   డ్రగ్స్ అమ్ముతున్న సయ్యద్ అబ్దుళ్ రెహమాన్‌ను అరెస్ట్ చేశారు. 9.28గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.