10-02-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతి కంగా చేపట్టబోతున్న హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ (హెచ్‌సిటీ) ప్రాజెక్టులు నిర్మించే ఫ్లుఓవర్లు, రహదారుల విస్తరణ ద్వారా హైదరాబాద్ నగర ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిశోర్ అన్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలను తీర్చడంతోపాటు వరద ముంపు సమస్యను తప్పించేందుకు రూ. కోట్ల వ్యయంతో నగరం నలుమూలలా ఫ్లుఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్‌యూబీ, ఆర్వో తదితర 50 పనులు చేపడుతున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేర ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం దా సచివాలయం నుంచి జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, ఇతర అధికారులతో ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా దానకిషోర్ మాట్లాడుతూ.. హెచ్‌సిటీతో నగరంలోని రహదారులను ప్రజలకు సౌకర్యంగా తీర్చిదిద్దేందుకు ప్రభు సిద్ధంగా ఉన్నదన్నారు. మొత్తం మూడు దశలలో ప్రాజెక్టులను చేపట్టనున్న తెలిపారు. అనంతరం ఇండియన్ బిజినెస్ స్కూ వద్ద పనులను జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తితో కలిసి దానకిషోర్ పరిశీలించారు.
నానల్‌నగర్, రేతి భౌలి, ఖాజాగూడ జంక్షన్, ట్రిపుల్ ఐటి, విప్రో, డిఎల్‌ఎఫ్ జంక్షన్లతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు అధికంగా ఉండే సరో జినీదేవి కంటి ఆసుపత్రి నుంచి రాడ్‌సన్, బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1 నుంచి చింతల్ బస్తీ మీదు ఖైరతాబాద్ వరకు కమిషనర్ అధికారులతో కలిసి జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలం పరిశీలించారు. ఈ ప్రాంతాల్లో చేపట్టనున్న పనులకు తక్షణమే టెండర్ పక్రియని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.