calender_icon.png 12 October, 2025 | 12:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ వైఖరి మారాలి

10-10-2025 12:55:22 AM

బీఆర్‌ఎస్ యువ నాయకులు మాణిక్ యాదవ్

అమీన్ పూర్, అక్టోబర్ 9 :రాష్ట్ర ప్రభుత్వం బస్సు చార్జీలను పెంచిన నేపథ్యంలో ప్రజల తరఫున బలమైన నిరసన తెలపడానికి బీఆర్‌ఎస్ పార్టీ పిలుపు మేరకు చలో బస్ భవన్ కార్యక్రమానికి బయలుదేరిన సమయంలో పటాన్ చెరు కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్ ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

ఒకవైపు ఫ్రీ బస్ ప్రయాణం అని చెబుతూ మరోవైపు చార్జీలు పెంచడం ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన భారమని బీఆర్‌ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మాణిక్ యాదవ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి పౌరుడికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ శాంతియుత నిరసన తెలిపే హక్కు ఉందన్నారు.

ఈ హక్కును కాలరాసి ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించిన కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ వైఖరిని ప్రదర్శించిందని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయిన ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని మాణిక్ యాదవ్ ఆరోపించారు.