calender_icon.png 10 January, 2026 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత

09-01-2026 08:06:03 PM

కల్హేర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల పరిధిలోని మాసన్పల్లి గ్రామ శివారులో గల రాజారం ధాభ దగ్గర అక్రమంగా తరలిస్తున్న లారీ TS15UD0159లో సుమారు 200 క్వింటళ్ళు అందజా 20 టన్నులు రేషన్ బియ్యాన్ని కల్హేర్ ఎస్ఐ రవి గౌడ్ నమ్మదగిన సమాచారం మేరకు గుర్తించి పట్టకున్నారు. NH161 వ జాతీయ రహదారిపై భారీ మొత్తంలో పీడీఎస్ బియ్యాన్ని బిధర్ నుంచి నిజాం సాగర్ వైపు తరలిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న కల్హేర్ పోలీసులు లారీలో తనిఖీ చేసి పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీ, డ్రైవర్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఎస్ఐ రవి గౌడ్ వెంట పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.