09-01-2026 12:14:47 AM
చెన్నూర్, జనవరి 8 : చెన్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌ని నియమిస్తూ గురువారం కమిషనర్ ఆఫ్ డైరెక్టర్ మార్కెటింగ్ నుంచి చెన్నూర్ మార్కెట్ కమిటీ కార్యాలయానికి ఉత్తర్వులు అందినట్లు సమాచారం. మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కోటపల్లి మండల నాగంపేటకు చెందిన మహేష్ ప్రసాద్ తివారిని నియమించారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన మహేష్ ప్రసాద్ కోటపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. మహేష్ ప్రసాద్ తివారికి మార్కెట్ కమిటీ లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.