09-01-2026 08:14:11 PM
శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో 15 రోజుల హుండీ ఆదాయం 1.08 కోట్లు
వేములవాడ,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో గత 15 రోజుల హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఈ కాలంలో భక్తుల నుంచి నగదు రూపంలో రూ.1,08,10,394,మిశ్రమ బంగారం 32 గ్రాములు, మిశ్రమ వెండి 3 కిలోల 100 గ్రాములు సమకూరినట్లు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమం ఆలయ ఈఓ రమాదేవి సహా సంబంధిత అధికారులు, పోలీసుల పర్యవేక్షణలో నిర్వహించగా, ఆలయ సిబ్బంది, సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.