calender_icon.png 10 January, 2026 | 9:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ సర్కారుతో పేదల సొంతింటి కళ నెరవేరుతుంది

09-01-2026 08:19:29 PM

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు

పట్టణంలో శరవేగంగా అభివృద్ధి పనులు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు

పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి పట్టణంలోని 13,14, 32, 33 వార్డుల్లో అర్హులైన లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్ల నూతన నిర్మాణాలకు స్థానిక నాయకులతో కలిసి భూమి పూజా, శంకుస్థాపనలు చేసి వారికి ప్రొసీడింగ్ పత్రాలను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల సొంతింటి కళ నెరవేరుతుందని అలాగే అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.

పెద్దపల్లి పట్టణంలో చాలా మేరకు సొంతిల్లు లేని పేద ప్రజలు ఉన్నారని, వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి వారిని సొంతింటి వారిని చేయడం జరుగుతుందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ పేరిట పేదలను మోసం చేసిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ పేదలకు ఒక్క ఇళ్లు కూడా అందించలేదని, కానీ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగుతుంది.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని అన్నారు. పెద్దపల్లి పట్టణం సుందరంగా మారుతుందని, గతంలో నిర్వీర్యం అయిన అభివృద్ధి పనులు కాంగ్రెస్ హయంలో సుందరంగా మారుతుందని, పెద్దపల్లి పట్టణ కేంద్రంలో నూతన బస్సు డిపో, బైపాస్ రోడ్డు, 50 పడకల నుండి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఆధునీకరణ, నూతన కోర్టు భవనం లాంటి అనేక అభివృద్ధి జరుగుతుంది.

జిల్లా కేంద్రానికి వచ్చే అన్ని రహదారులను అభివృద్ధి పరుస్తూ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామని, పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులో అనేక రకాల అభివృద్ధి పనులు చేసుకోవడం జరుగుతుందని, ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు.  గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్దపల్లి పట్టణం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, ఎ.ఈ, మున్సిపల్  అధికారులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పలు వార్డుల ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.