calender_icon.png 10 January, 2026 | 9:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుస్తుల పంపిణీ

09-01-2026 07:43:47 PM

అర్మూర్,(విజయక్రాంతి): ఆలూరు మండలం దేగాం గ్రామంలో అంగన్వాడీ  కేంద్రంలో చిన్నారులకు  మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వార  ప్రభుత్వం  అందజేస్తున్న  డ్రెస్ లు  (దుస్తులు)లను శుక్రవారం అంగన్వాడీ  శిశువులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ ఇట్టడి లింగారెడ్డి  మాట్లాడుతూ...  ప్రభుత్వం  మహిళా శిశు సంక్షేమానికి  అనేక పథకాలు  అమలు చేస్తున్నదని, గర్భిణీ మహిళలకు శిశువులకు  పౌష్ఠిక  ఆహారం అందజేస్తున్నదని అన్నారు.  ఎంతో మంది పేదవారు పౌష్ఠిక ఆహారం లేక  అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతున్నదని అన్నారు. అందరూ కూడా ఈ  పథకాలను ఉపయోగించు కోవాలని కోరారు.