calender_icon.png 10 January, 2026 | 9:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

09-01-2026 08:10:29 PM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ బాలసముద్రంలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని మొత్తం 81 మంది లబ్ధిదారులకు రూ.25,86,500 విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల ఆరోగ్య విషయంలో అత్యంత బాధ్యతతో వ్యవహరిస్తున్నారని, అన్నివిధాలుగా అండగా నిందిస్తున్నారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారికి రాజకీయాలకతీతంగా అర్హులందరికీ సీఎం సహాయనిది అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

గత పాలకుల కాలంలో సహాయ నిధుల కోసం దళారీ వ్యవస్థ రాజ్యమేలేదని ప్రజలు చెక్కు పొందాలంటే డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండేదని విమర్శించారు. కానీ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటినుండి ఎవరికి నయా పైసా ఖర్చు లేకుండా నేరుగా లబ్ధిదారులకు చెక్కులు అందే విధంగా చేశామని పేర్కొన్నారు. అనంతరం 5వ డివిజన్ కొత్తూరు జెండాలో 30 లక్షల రూపాయల వ్యయంతో, 49వ డివిజన్ జూలైవాడ, రెవెన్యూ కాలనీలలో 1 కోటి 20 లక్షల రూపాయలతో చేపట్టనున్న అంతర్గత రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రైనేజీల పనులకు శంకుస్థాపనలు చేశారు.