14-01-2026 02:41:38 AM
తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ
చైనా మాంజా విక్రయించిన, కొన్న కఠిన చర్యలు
రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్, ఎస్సై ప్రశాంత్‌రెడ్డి
ముషీరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): గంజాయి డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో చైనా మాంజాపై ఉక్కు పాదం మోపాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ అన్నారు. చైనా మాంజా వద్దు స్వదేశీ కాటన్ మాంజ ముద్దు అని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం వేముల రామకృష్ణ చైర్మన్ తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో యువకులకు గాలిపటాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ గుట్టు చప్పుడు కాకుండా పలుచోట్ల చైనా మాంజా విక్రయిస్తున్నారన్నారు. దానివల్ల మనుషులకు జీవరాసులకు ప్రాణాపాయ స్థితి కలుగుతుందన్నారు. చైనా మాంజా ఒక మరణాయుధమని ద్విచక్ర వాహనదారులకు గొంతులు తెగుతున్నాయన్నారు.
పాదాచారులు నడుచుకుంటూ వెళుతున్న సమయంలో కాళ్లకు చిక్కుకొని కింద పడుతున్నారని, గాయాల పాలవుతున్నారన్నారు. యువకులు కుటుంబ సమేతంగా సంతోషంగా పండగ నిర్వహించుకోవాలని అన్నారు. రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్, ఎస్‌ఐ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ చైనా మాంజా విక్రయాలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. నిషేధిత చైనా మాంజా పై ఎవరై నా అమ్మకాలు జరిపిన వారిపై చర్యలు తప్పవు అన్నారు. ఈ కార్యక్రమంలో యాద య్య, మంగళవారం శ్రీని వాస్, వేముల రమేష్, రఘు ముదిరాజ్, పంబాల రాజు, నరేష్, నరసింహ రాజు, శ్రీనివాస్, దయాకర్, మోహన్, చింటూ, వేణు, లల్లు, మోక్షిత్ పాల్గొన్నారు.