24-01-2026 12:17:13 AM
కోదాడ, జనవరి 23: నేటి విద్యార్థులకు సెల్ఫ్ మోటివేషన్ ఎంతో అవసరమని ప్రముఖ ఆర్థిక నిపుణులు వంగ రాజేంద్రప్రసాద్ అన్నారు అమృత రామానుజరావు ట్రష్ట్ ఆధ్వర్యంలో కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్ధుల మనో వికాసం కొరకు శుక్రవారం మోటివేషనల్ క్లాస్ ఏర్పాటు చేశారు.
ముందుగా సరస్వతి మాత విగ్రహానికి పూలమాలలు సమర్పించి అదేవిధంగా నేతాజీ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు కిట్స్ కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ చరవాణి ద్వారా ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గాంధీ , ఆర్ట్ ట్రస్ట్ ఛైర్మన్ శేషప్రసాద్, ట్రష్ట్ సెక్రటరీ మంత్రిప్రగడ శ్రీధర్ రావు...సభ్యులు.కొండపల్లి గోపి...సీనియర్ పాత్రికేయులు కోట.ప్రసాద్ ..సీనియర్ రాజకీయ నాయకులు కొమరగిరి రంగారావు, సీనియర్ న్యాయవాది అక్కిరాజు యశ్వంత్, కళాశాలఅధ్యాపకులు, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.