28-01-2026 12:00:00 AM
పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే
చిట్యాల, జనవరి 27 : చిట్యాల మున్సిపాలిటీలోని 2వ వార్డుకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ షబానా అజీముద్దీన్ మరియు ఆ పార్టీకి చెందిన యాభై కుటుంబాలు ఆ పార్టీకి రాజీనామా చేసి మంగళవారం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఆయన వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పట్టణ కేంద్రంలోని రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అభివృద్ధి, సంక్షేమం కుంటునపడ్డాయని, డైవర్షన్ పాలిటిక్స్ తో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. మార్పు మార్పు అంటూ నమ్మి ఓటేసిన ప్రజలను కాంగ్రెస్ పార్టీ నట్టేట ముంచిదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త పథకాలను ఇవ్వకపోవడమే గాక ఉన్న పథకాలను రద్దు చేసి పేదోల్ల పొట్టకొడుతుందని మండిపడ్డారు.
కేసిఆర్ అందించిన బతుకమ్మ చీరలను పేరుమార్చి ఇందిరమ్మ చీరలంటూ ఎన్నికల సమయంలో పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. ఆడబిడ్డల, రైతన్నల శాపనార్థాలు ఈ రాష్ట్రానికి మంచిది కాదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో గ్రామాల్లో అభివృద్ధి, సంక్షే మం, ప్రజలకు భద్రత, రక్షణ కరువైందని తెలిపారు. బిఆర్‌ఎస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని పట్టణ ప్రజలను ఆయన కోరారు. కార్యక్రమంలో ము ఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.