calender_icon.png 10 September, 2025 | 3:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టర్కీలో ఘోర అగ్ని ప్రమాదం

22-01-2025 02:22:54 AM

* 66 మంది మృతి l రిసార్ట్‌లో ఘటన

ఇస్తాంబుల్, జనవరి 21: టర్కీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బోలు ప్రావిన్స్‌లో ఉన్న ఓ స్కీ రిసార్టు హోటల్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 66 మంది ప్రాణాలు కోల్పోగా... మరో 50 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ అగ్ని ప్రమాద ఘటనలో 51 మందికి గాయాలయినట్లు టర్కీ ఆరోగ్య శాఖ మంత్రి కేమల్  ధృవీకరించారు.

స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రెస్టారెంట్‌లోని 11వ అంతస్థులో మొదట మంటలు మొదలయినట్లు తెలుస్తోంది. సమాచారం తెలియగానే అగ్ని మాపక యం త్రాలు అక్కడకు చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. హోట ల్‌లో ఉన్న కొందరు ఎమర్జెన్సీ కిటికీల నుం చి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. మం టలు సంభవించిన సమయంలో హోటల్‌లో 238 మంది అతిథులు ఉన్నారు.