calender_icon.png 6 December, 2025 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీగా సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు

06-12-2025 12:29:06 AM

 భూత్పూర్, డిసెంబర్ 5 : మూడవ విడత సర్పంచ్ ఎన్నికలలో భాగంగా భూత్పూర్ మండల పరిధిలోని పలువురు అభ్యర్థులు  శుక్రవారం కర్వేన గ్రామంలో ఏర్పాటు చేసిన కస్టర్లలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అదేవిధంగా పోతుల మడుగు టిఆర్‌ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా సత్యనారాయణ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. తాటిపర్తి, పోతల మడుగు గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి భారీ ర్యాలీతో క్లస్టర్ల వరకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్ గౌడ్, సీనియర్ పార్టీ నాయకులు చంద్రశేఖర్ గౌడ్, నారాయణ గౌడ్, అశోక్ గౌడ్, పసియుద్దిన్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.