calender_icon.png 23 November, 2025 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ

10-02-2025 12:32:15 AM

  • రూ. 25 లక్షల నగదు బ్యాగ్ అపహరణ కాలకృత్యాలు తీర్చుకొని వచ్చేలోగా ఉడాయింపు 
  • నార్కెట్‌పల్లి పోలీసులకు బాధితుడి ఫిర్యాదు సీసీ కెమెరాలను జల్లెడపడుతున్న పోలీసులు ఇద్దరు అనుమానితుల గుర్తింపు

నల్లగొండ, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి) : ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో రూ. 25 లక్షల నగదును దుండగులు అపహరించారు. ప్రయాణికుడు టాయిలెట్కు వెళ్లొచ్చేలోగా సీటులో ఉంచి నగదు బ్యాగుతో దుండగులు ఉడాయించారు. నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలం గోపలాయపల్లి శివారులోని ఓ హోటల్ వద్ద ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది.

చైన్నైలోని అన్నానగర్కు చెందిన వెంకటేశ్వర్లు రూ. 25 లక్షలు తీసుకొని హైదరాబాద్ వెళ్లేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కాడు. నార్కెట్పల్లి మండలం గోపలాయపల్లి శివారుకు రాగానే ఓ హోటల్ వద్ద ఉదయం డ్రైవర్ బస్సు నిలిపాడు. ప్రయాణికులంతా దిగడంతో వెంకటేశ్ నగదు బ్యాగ్ను సీట్లోనే వదిలి కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లాడు.

కాసేపటికి వచ్చి చూడగా బ్యాగ్ కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని బాధితుడు నుంచి వివరాలు సేకరించారు. పరిసరాల్లోని సీసీ కెమెరాలను జల్లెడపట్టారు. ఈ కేసులో ఇద్దరు అనుమానితులను గుర్తించి వారికోసం గాలిస్తున్నట్లు ఎస్‌ఐ క్రాంతికుమార్ తెలిపారు. గతంలో ఇదే హోటల్ వద్ద నిలిపిన పలు ప్రైవేటు బస్సులో చోరీలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.