calender_icon.png 23 November, 2025 | 6:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఔటర్‌పై కార్లతో విన్యాసాలు

10-02-2025 12:32:32 AM

రాజేంద్రనగర్ ఫిబ్రవరి 9: ఔటర్ రింగ్ రోడ్డుపై  ఇద్దరు ఆకతాయిలు రెండు కార్లతో విన్యాసాలు చేశారు. రింగు రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి శంషాబాద్ ఇన్‌స్పెక్టర్ నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..  ఓఆర్‌ఆర్ పెట్రోలింగ్ వాహనం డ్రైవర్ రాజు, హెల్పేర్ మణిరాజ్ తో కలిసి ఔటర్ రింగ్ రోడ్డుపై విధులు నిర్వహిస్తున్నారు.

ఆదివారం  తెల్లవారుజా మున 3 గంటలకు శంషాబాద్ టోల్గేట్ ఎగ్జి ట్ నెం. 16, పెద్ద గోల్కొండ టోల్గేట్ ఎగ్జిట్ నెం. 15 మధ్య ఆర్ హెచ్ ఎస్ -136 కేఎం వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఇద్దరు గుర్తు తెలియని కార్ల డ్రైవర్లు తమ కార్లతో విన్యాసాలు చేస్తున్నారు. వాహనదారులు,  ఇతరుల వ్యక్తిగత భద్రతకు ప్రమాదం కలిగించే విధంగా వారు కార్లను నిర్లక్ష్యంగా నడిపారని తెలిపారు.

రోడ్డు ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారని వారికి సమాచారం అందింది. వెంటనే పెట్రోలింగ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునేసరికి సదరు కార్ల డ్రైవర్లు తమ కార్లతో అక్కడి నుండి పారిపోయారు. ఔటట్ రింగ్ రోడ్డుపై  కార్ల తో విన్యాసాలు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డ్రైవర్ రాజు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కెమెరాల ద్వారా విచారణ జరుపుతున్నా మన్నారు.