calender_icon.png 11 September, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణపతి చందా ఇవ్వలేదని కులబహిష్కరణ

11-09-2025 12:00:00 AM

జగిత్యాల అర్బన్, సెప్టెంబర్ 10(విజయ క్రాంతి): గణపతి చందా ఇవ్వలేదని నాలుగు కుటుంబాలను కుల బహిష్కరణ చేసిన అ మానవీయ సంఘటన జగిత్యాల మండలం కల్లెడ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామం లో ఓ కులానికి చెందిన 80 మంది కుటుంబాలు కలిసి గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకున్నారు.

అయితే తమ ఆర్థిక పరిస్థితుల కారణంగా చందా ఇవ్వని నాలు గు కుటుంబాలను కులం నుండి వెలివేయ డం సంచలనం సృష్టించింది. కులాల, మతా ల మధ్య ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో మన పెద్దలు పండగలను రూపొందించారు. అయితే అందుకు భిన్నంగా కల్లెడ గ్రా మంలో వినాయక చవితి పండుగ ఓ నాలు గు కుటుంబాలను కులం నుండి వేరు చే సింది. తాము చందా ఇవ్వని కారణంగా గణపతి ఉత్సవాలలో దేవున్ని దర్శించుకుం దామని వెళ్ళితే తమకు అనుమతి ఇవ్వకుండా అవమానించారని బాధితులు వాపో యారు.

గణపతి చందా రు.1,116 ఇవ్వలేదన్న కారణంతో గాలిపెల్లి అరుణ్, గాలి పెల్లి గంగ లచ్చయ్య, గాలిపెల్లి అంజి, గాలి పెల్లి సూర్య వంశీ కుటుంబాలను కుల పెద్దలు కులం నుండి బహిష్కరిస్తూ తీర్మానించారు. అంతటితో ఆగకుండావారితో ఎవరైనా మా ట్లాడినా.. పలకరించినా.. సహకరించిన వారి కి కూడా రు.25,000 జరిమానా విధిస్తామని, కుల బహిష్కరణకు గురైన వారితో ఎవ రైనా మాట్లాడినట్లు తమకు సమాచారం ఇస్తే వారికి రూ. 5వేలు బహుమతి కూడా ఇస్తామని బహిరంగంగా డబ్బు చాటింపు చేశారు.

పాతకాలపు జులుం గుర్తు చేసేలా మానవ హక్కులను మంట కలిపే విధంగా ఆ కుల పెద్దలు తీసుకున్న నిర్ణయం తో బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. బాధితు ల నుండి ఫిర్యాదు అందుకున్న జగిత్యాల రూరల్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. రూరల్ సీఐ సుధాకర్ మాట్లాడుతూ తమకు బాధితుల నుండి ఫిర్యాదు అందిందని, బాధితులతో పాటు కుల పెద్దలను పిలిపించి పూర్వపరాలు విచారించి రెవెన్యూ అధికారుల సహకారంతో సమస్యను పరిష్కరిస్తామని బాధితులకు న్యాయం చేస్తామనితెలిపారు.