calender_icon.png 24 January, 2026 | 5:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాక్ జట్టుపై ఫిక్సింగ్ ఆరోపణలు

24-01-2026 12:47:59 AM

అండర్ 19 ప్రపంచకప్‌లో కలకలం

హరారే, జనవరి 23 : క్రికెట్‌లో ఫిక్సింగ్ అనగానే పాకిస్తాన్ పేరే గుర్తొస్తుంది. గతం లో పలు సందర్భాల్లో పాక్ క్రికెటర్లు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. తాజాగా అండర్ 19 ప్రపంచకప్‌లోనూ పాక్ జట్టుపై ఫిక్సింగ్ ఆరోపణలు చెలరేగాయి. జింబాబ్వేతో మ్యాచ్‌లో పాక్ బ్యాటింగ్ శైలి తీవ్ర అనుమానాలుకు తావిస్తోంది. ఈ మ్యాచ్‌లో పాక్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలిచింది. మరో 181 బంతులు మి గిలుండగానే టార్గెట్ అందుకుంది.

అంతవరకూ బాగానే ఉన్నా గెలుపు ముంగిట పాకి స్తాన్ అత్యంత నిదానంగా ఆడడం తీవ్ర చర్చానీయాంశమైంది. పాక్ ఆడిన తీరు చూ స్తే 20 ఓవర్లలోపే టార్గెట్ ఫినిష్ చేస్తుందని అంతా అనుకున్నారు. అలా జరిగుంటే జిం బాబ్వే ఇంటిదారి పట్టేది. రన్‌రేట్ ప్రకారం స్కాట్లాండ్ ముందంజ వేసేది. కానీ పాకిస్తాన్ యువ జట్టు 16 ఓవర్ నుంచి 25వ ఓవర్ల మధ్య ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా బ్యాటింగ్ చేసింది.

16వ ఓవర్లోనే 96 రన్స్ చేసిన పాక్ ఆ తర్వాత 50 డాట్ బాల్స్ ఆడ డం తీవ్ర అనుమానాలకు తావిచ్చింది. ఉద్దేశపూర్వకంగా పాక్ జట్టు స్కాట్లాండ్‌ను బ యటకు పంపించి, జింబాబ్వేను తర్వాత రౌండ్‌కు చేర్చేందుకు ప్రయత్నించిందన్న అ నుమానాలు తలెత్తాయి. టోర్నీ నిబంధనల ప్రకారం సూపర్ సిక్స్‌కు అర్హత సాధించిన జట్టు అదే గ్రూప్‌లో సూపర్ సిక్స్‌కు క్వాలిఫై అయిన జట్లపై సాధించిన పాయింట్లు, నెట్ రన్‌రేట్ ఆధారంగా ముందంజ వేస్తుంది. దీంతో స్కాట్లాండ్ సూపర్ సిక్స్‌కు వచ్చి ఉం టే పాక్ రన్‌రేట్ కాస్త తక్కువవుతుంది.

దీని ని ముందుగానే తెలుసుకుని ఆ జట్టు ఇలా నెమ్మదిగా ఆడిందా అన్న అనుమానాలు వచ్చాయి. ఈ పరిణామం ఫిక్సింగ్ కిందకి రాకపోయినా ఉద్దేశపూర్వకంగా ఫలితాన్ని ప్రభావితం చేసినట్టుగా భావిస్తారు. దీని ప్రకారం ఐసీసీ పాక్ కెప్టెన్‌పై చర్యలు తీసుకోవచ్చు. కాగా గ్రూప్ సి నుంచి పాక్, జిం బాబ్వేతో పాటు ఇంగ్లాండ్ కూడా సూపర్ సిక్స్‌కు దూసుకెళ్లింది.