calender_icon.png 24 January, 2026 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్ఫరాజ్ డబుల్ సెంచరీ

24-01-2026 12:46:21 AM

ముంబై భారీస్కోరు

హైదరాబాద్, జనవరి 23 : టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మరోసారి దుమ్మురేపాడు. భారత సెలెక్టర్లు పట్టించుకోపోయినా.. ఏ మాత్రం నిరాశ చెందని సర్ఫరాజ్ దేశవాళీ క్రికెట్లో నిలకడగా దుమ్మురేపుతున్నాడు. ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ రెండో దశ టోర్నీ తొలి మ్యాచ్లోనే విధ్వంసకర డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఈ టోర్నీలో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్న సర్ఫరాజ్ ఖాన్.. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో 206 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు.

ముంబై ఇన్నింగ్స్‌లో ఈ యువ బ్యాటర్ 219 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్లతో 227 పరుగులు చేశాడు. ఈ సీజన్ రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ ఖాన్‌కు ఇదే తొలి శతకం కాగా 17వ ఫస్ట్ క్లాస్ సెంచరీ. అతనికి ఇది ఐదో డబుల్ సెంచరీ. ఈ విధ్వంసకర డబుల్ సెంచరీతో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 5వేల పరుగుల మైలురాయి కూడా  అందుకున్నాడు. 2019-20 సీజన్ తర్వాత అత్యధిక ఫస్ట్ క్లాస్ సెంచరీలు బాదిన మూడో బ్యాటరగానూ సర్ఫరాజ్ నిలిచాడు.

అనుస్టప్ ముజుందార్, అమన్దీప్ ఖారేలు మాత్రమే అతని కంటే ఎక్కువ సెంచరీలు సాధించారు. కాగా ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ తరఫున బరిలోకి దిగిన భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ను కూడా సర్ఫరాజ్ ఖాన్ చితక్కొట్టాడు. అతని బౌలింగ్‌లో 39 బంతులాడి 45 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ ధాటికి ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 560 పరుగుల భారీ స్కోర్ చేసింది. సర్ఫరాజ్ ధాటికి హైదరాబాద్ బౌలర్లు ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు.

సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు ముంబై కెప్టెన్ సిద్దేష్ లాడ్ సెంచరీతో చెలరేగాడు.ఇటీవల ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో కూడా సర్ఫరాజ్ ఖాన్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదాడు. బరోడాతో జరిగిన మ్యాచ్లో 16 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ టోర్నీలో ముంబై తరఫున 6 ఇన్నింగ్స్‌లు ఆడి 303 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.