calender_icon.png 23 September, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంధకారంలో మాతాశిశు ఆసుపత్రి

23-09-2025 12:00:00 AM

-అడ్రస్ వెతుక్కుంటున్న రోగులు..

-విద్యుత్ వెలుగులు లేక వెలవెల..

కొత్తగూడెం, సెప్టెంబర్ 22, (విజయక్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని  రా మవరం పట్టణంలో గల మాత శిశు ఆసుపత్రి అంధకారంలో మగ్గుతోంది. ప్రభుత్వ అధికారులకు కూత వేటు దూరంలో ఉన్న ఈ దావఖాన, నిత్యం పలు సమస్యలు తెలు గు చూస్తున్నాయి. స్థానికుల వివరాల ప్రకా రం గత వారం రోజుల నుండి, రాత్రి వేళల్లో మాతా శిశు ఆసుపత్రి ప్రముఖ ద్వారం వద్ద  చిమ్మ చీకటి నెలకొంది.

దీంతో వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే  రోగులు అడ్రస్ తెలియక తికమక పడుతూ, పలువురిని ప్రాధే యపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఆస్పత్రి విజయవాడ హైవే ను ఆనుకుని ఉండటంతో, ఆసుపత్రి నుండి వచ్చేటు వంటి వాహనా లు, నేరుగా హైవే పైకి రావడంతో, రోడ్డుకు ఇరువైపులా భారీ వాహనాలు ఆగి ఉండటం, ప్రమాదాలకు నిలయాలుగా మా రుతున్నాయి. కాలినడకన వచ్చే రోగుల సై తం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆసుపత్రి పూర్తి అపరిశుభ్రతతో నిండుకొని, దుర్గంధం వెదజల్లుతోందని రోగులు వాపోతున్నారు. వీటి వల్ల పలు రోగాలు ప్రభలే అవకాశం ఉందని భయాందోళన చెందుతున్నారు.   ఆసుపత్రి ఆవరణ ముఖద్వారం వ ద్ద, వెలుతురు లేక రోగుల ఇక్కట్లు పడుతు న్న  అధికారులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నట్లు రోగులు  ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు.  అధికారులు సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

రోగులను పలకరిస్తే ఆసుపత్రి వద్ద నిఘానేత్రం ఏర్పాటు చేయాలని  కోరుతున్నారు. ఆసుపత్రి  సూపరిండెండెంట్ సాగరిక ను వివరణ కోరగా, భవిష్యత్తులో ఇలాంటివి సమస్యలు పునరావృతం కాకుండా చూస్తామని, వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.